తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కొంతమంది సమయానికి ఆక్సిజన్ అందక కూడా మరణిస్తున్న సంఘటనలు ఎక్కువే అవుతున్నాయి. కాగా సినీ ప్రముఖుల కోవిడ్ బాధితుల కోసం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు సుకుమార్ తన వంతు సహాయం చేయడానికి శ్రీకారం చుట్టాడు. 25 లక్షల రూపాయలతో కోనసీమ ఏరియలోని కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది కోసం ఎమర్జెన్సీ గా ఉందని ఆజాద్ ఫౌండేషన్ ద్వారా కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన సుకుమార్ వెంటనే తగినంత మందికి సహాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎమర్జెన్సీగా ఆక్సిజన్ కావాల్సి వస్తే వెంటనే సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుకుమార్ ముందుకు రావడం హర్షణీయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.