కరోనా నివారణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ కోసం గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం అయ్యారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన జీఎంవో సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్స్, కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరు సహా.. పలు అంశాలపై చర్చించారు.. బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు అన్ని చర్యలు పటిష్టంగా అమలు జరగాలని.. ప్రాణాలు తెగించి రోగులకు సేవలు అందిస్తున్న డాక్టర్స్, వైద్య, శానిటరీ, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది ఈ సమావేశం.
ప్రతీ ఆస్పత్రిలో 50 శాతం ఆరోగ్య శ్రీ పెషేంట్స్ కు బెడ్స్ ఇవ్వాలని స్పష్టం జీఎంవో.. ప్రవేట్ హాస్పిటల్స్ లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అమలు జరగాలని.. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలకు వెనుకాడ వద్దని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదేశించినట్టు గుర్తుచేశారు.. ఇక, ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరగాలని.. ప్రతి ఆస్పత్రిలో కరోనా పెషేంట్స్ కు ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూడాలని.. రెమిడీసివర్ ఇంజక్షన్స్ లో బ్లాక్ లో విక్రయిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ ఇంజక్షన్లు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని.. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని.. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన రోగులకు వైద్యం నిరాకరించే ఆస్పత్రులపై కఠినంగా వ్యవహారించాలని నిర్ణయించారు.
Also Read
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!