ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 16,167 మందికి పాజిటివ్‌గా తేలింది.. అయితే, మరోసారి మృతుల సంఖ్య వంద దాటింది.. తాజాగా 104 మంది కరోనాతో మృతిచెందారు.. చిత్తూరులో 14, పశ్చిమ గోదావరిలో 13, విశాఖలో 11, అనంతపూర్‌లో తొమ్మి ది, నెల్లూరులో తొమ్మి ది, గుంటూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, ప్రకాశం లో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, కృ ష్ణలో ఆరుగురు, కర్నూ ల్ లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు., కడపలో ఒక్క రు మరణించారు. మరోవైపు.. గత 24 గంటల్లో 21,385 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసులు 16,43,557కు చేరగా.. ప్రస్తుతం 1,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటి వరకు 14,46,244 మంది కోలుకోగా… 10,531 మంది ప్రాణాలు వదిలారు.