సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను ఆ పార్టీ ట్విట్టర్‌లో పెట్టి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై యూపీ బీజేపీ విభాగం స్పందించింది. చాలా మంచి విషయం చెప్పారనీ, గతంలో అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్‌గా పేర్కొంటూ విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు అదే వ్యాక్సిన్‌ను ములాయం సింగ్ తీసుకున్నారని, త్వరలోనే అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారని బీజేపీ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే, ఈ ట్వీట్‌పై సమాజ్‌వాదీ పార్టీ స్పందించాల్సి ఉన్నది. వచ్చే ఎడాది యూపికి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అధికార బీజేపీ, సమాజ్‌పార్టీల మద్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కరోనా మహమ్మారి, తీసుకున్న చర్యలు, సామాన్యులను అదుకున్న వైనం వంటివి ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి.