దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో దిగువకు చేరుకుంటోంది. అత్యంత వేగంగా గ్రాఫ్ కిందికి పడిపోతోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే అన్ లాక్ దిశగా నిర్ణయాలు తీసేసుకున్నాయి. దీంతో, జనజీవనం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఇప్పటికే అన్ లాక్ మొదలైంది. ఢిల్లీలోనూ ఆంక్షలు సడలించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ మాత్రమే వుండే అవకాశం కనిపిస్తోంది. ఇక యధావిధిగా ప్రజాజీవనం ఉండేలా చూడాలని నిర్ణయించున్నారు. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నారు.