కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మనుషులతో పాటుగా జంతువులపై కూడా పడింది. తమిళనాడులోని వండలూరు జంతు ప్రదర్శన శాలలోని సింహాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు అతవీశాఖ అప్రమత్తం అయింది. జంతువులకు కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీలగిరి జిల్లా మధుమలై పులుల అభయారణ్యం సమీపంలోని తెప్పకాడు, టాప్‌స్లిప్ ఏనుగుల శిభిరాల్లో ఉన్న 52 ఏనుగులకు కరోనా పరీక్షలను నిర్వహించారు. ఏనుగుల ముక్కు, గొంతు నుంచి నమూనాలను సేకరించారు. వీటిని ఉత్తరప్రదేశ్‌లోని పశుగణ ప్రయోగశాలకు పంపించారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా మావటివాళ్లకు కూడా కరోనా టెస్టులు నిర్వహించినట్టు తమిళనాడు అటవీ మంత్రిత్వశాఖ తెలియజేసింది.