కరోనా ఉదృతి నేసథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదోతరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్ధు చేసిన ప్రభుత్వం ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా రద్ధు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మరలా కేసులు విజృంభించే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్‌లో యువత ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. థర్ఢ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం, పిల్లలకు కరోనా సోకుతుందనే వదంతులు వ్యాపిస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు.