ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది. కేరళ, మహారాష్ట్రతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని గతంలో నిపుణులు పేర్కొన్నారు. అయితే, థర్డ్ వేవ్ ఈ నెలలోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి, రెండో వేవ్‌ల మధ్య వచ్చిన గ్యాప్, తీవ్రత, కేసుల పెరుగుదల…
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రతమాత్రం తగ్గడంలేదు. ఒక్క కేరళరాష్ట్రంలోనే రోజువారీ కేసుల్లో సగానికి పైగా నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో 40,134 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,95,958కి చేరింది. ఇందులో 3,08,57,467 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,13,718 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 422 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి…
ప్రపంచంలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నది. 130కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాక జో బైడెన్ 100 రోజుల కార్యాచరణను తీసుకొచ్చారు. 100 రోజులు ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని, ఆ తరువాత అవసరం లేదని అన్నారు. 100 రోజుల కార్యచరణ తరువాత మాస్క్‌ను తప్పని సరి నుంచి తొలగించారు. ఆ తరువాత కథ మళ్లీ మొదటికి వచ్చింది. గత పది రోజుల నుంచి ఆ దేశంలో కేసులు…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. సినిమా థియోటర్లతో సహా అన్ని ప్రారంభమయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 455 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,406 కి చేరింది. ఇందులో 6,32,728 మంది కోలుకొని డిశ్చార్జ్…
ఏపీలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి… రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,287 మంది పాజిటివ్‌గా నమోదు కాగా… మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,430 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462 కు చేరుకోగా.. రికవరీ కేసులు 19,34,048 కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,395 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,019…
తమిళనాడులో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ రాష్ట్రంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, తమిళనాడు సరిహద్దు కలిగిన కేరళ రాష్ట్రంలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతిరోజు ఆ రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Read: జగన్…
దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 50 కోట్ల వరకు వ్యాక్సిన్ అందించారు. అయితే, మొదటి డోసులు వేగంగా వేస్తున్నా సెకండ్ డోస్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య అధికంగా ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, కోవీషీల్డ్, కోవాగ్జిన్‌తో పాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌లు కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిని రష్యానుంచి దిగుమతి చేసుకోవడంతో కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే…
కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. అప్పుడే.. థర్డ్ వేవ్ ప్రారంభమైపోయిదంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది.. అయితే, కోవిడ్ మూడో ఉద్ధృతి సూచనలు కనిపిస్తుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన కోవిడ్ చికిత్సలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. భారత కొవిడ్-19 క్విక్ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీ రెండో దశలో భాగంగా… 15 శాతం నిధులు అంటే 18 వందల 27 కోట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల…
ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. ఒలింపిక్ నగరం టోక్యోలో రికార్డు స్థాయి కేసుల్ని నమోదు చేస్తోంది. తాజాగా 4 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జపాన్ రాజధానిలో నాలుగువేలకు పైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. అలాగే దేశంలో వరుసగా రెండోరోజు 10వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోపక్క ఒలింపిక్ విలేజ్‌లో 21 మందికి కరోనా సోకింది. అక్కడ జులై 1 నుంచి ఇప్పటివరకూ 241 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే..…
కరోనా కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్‌డౌన్, కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ అమలు చేశాయి.. ఇంకా కోవిడ్ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో… ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు.. చాలా వరకు సడలింపులు ఇచ్చినా.. మరోవైపు.. పరిస్థితులను బట్టి.. కర్ఫ్యూ, నైట్ కర్ప్యూ పొడిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ వరకు నైట్‌కర్ఫ్యూను పొడగించింది. ఆదివారం నుంచి వచ్చే నెల వరకు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం…