కరోనా దెబ్బకు వర్కింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది… చిన్న సంస్థల నుంచి బడా కంపెనీలు వరకు ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫ్రం హోం బాట పట్టాయి… పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగులను ఆఫీసుకు రప్పిస్తున్నారు.. మరికొన్ని బడా సంస్థలు సైతం.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అమలు చేస్తూనే ఉంది.. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే పని విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది గూగుల్.. సెప్టెంబరు నుంచి ఆఫీసుకు రావాలంటూ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కోరింది. సుమారు 10,000ల మందికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడంపై స్పందించారు. ఇందులో ఇళ్లు, ఆఫీసుల నుంచి పని చేసే అవకాశం కల్పించాలంటూ 8500 మంది మంది ఉద్యోగులు గూగుల్‌కు విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు.. కొందరు అయితే.. తమను ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా కూడా గూగుల్‌ను కోరుతున్నారు.. మరికొందరైతే వర్క్‌ప్లేస్‌లో ఎక్వీప్‌మెంట్ మార్చితేనే ఆఫీస్‌కి వచ్చేందుకు సిద్ధమంటూ బదులిచ్చారు.. దీంతో.. ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ఇళ్లు, ఆఫీసుల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో పని చేసుకునేందుకు గూగుల్ సుముఖత వ్యక్తం చేస్తోంది.. ఉద్యోగులు కోరుకున్న్టుగా కొందరిని రీలోకేట్ చేసేందుకు సైతం అనుకూలంగానే ఉన్నట్టు తెలిపింది. మరోవైపు.. స్టాటిస్టా నివేదిక ప్రకారం గూగుల్ ఉద్యోగుల్లో 55 శాతం మంది తమ ఆఫీస్‌లను మార్చాలని కోరితే, మిగిలిన 45 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తామని చెబుతున్నారు.. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెబుతోంది గూగుల్. ఉద్యోగుల అవసరాల్ని తీర్చడం సాధ్యమేనా.. ఆఫీసు రూల్స్ ఎలా మారిస్తే బాగుంటుంది.. తదిరత అంశాలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుండగా.. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని.. తర్వాతే అవగాహన వస్తుందని చెబుతున్నారు.