ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్…
అన్ని కేసుల్లో బెయిల్స్ పోసాని కృష్ణ మురళికి సంబంధిత న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. నిన్న నర్సారావుపేట కోర్టు, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరు చేశాయి. అంతకుముందే రాజంపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానిపై మొత్తంగా 17 కేసులు నమోదయ్యాయి. మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
KTR : ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని కోరుతూ లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే… కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. సీసీ టీవీ పర్యవేక్షణలో కేటీఆర్…
లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. కంటైనర్ షిప్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ విచారణలో నిర్ధారించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ అని నిర్ధారణ అయింది.కోర్టుకు ఇదే సమాచారాన్ని సీబీఐ ఇచ్చింది.
బ్లాక్ మాస్క్‌లు ధరించి ఫొటోలు దిగినందుకు ఇద్దరు విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు విద్యార్థులు తమ స్నేహితుడి కోసం మాస్క్‌లు ధరించినందుకు పాఠశాల నుండి బహిష్కరించబడ్డారు. ఇందుకు సంబంధించిన జరిగిన కేసులో ప్రతి విద్యార్థికి 8.2 కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ముందుగా ఈ విషయంపై ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలిఫోర్నియాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలపై దావా వేశారు. 2017లో, యువకులు మొటిమల చికిత్సకు మాస్క్‌లను…