హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరున్న స్వీట్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి కుటుంబానికి షాక్ తగిలింది. పుల్లారెడ్డి కొడుకు రాఘవరెడ్డి కి షాక్ ఇచ్చారు పోలీసులు. ఇంట్లో నిర్మించిన అడ్డుగోడ ను తొలగించారు. కోడలు ఇంటిలోకి రాకుండా కట్టిన గోడ ను ఆధికారులు కూల్చి వేశారు. కోడలు రాకుండా అడ్డుకట్ట వేసిన కొడుకు రాఘవరెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను తాము అమలుచేశామని అధికారులు అంటున్నారు.పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోడలు ప్రజ్ఞారెడ్డిని ఇంట్లోకి రానిచ్చేలా చూడాలని, ఆమెకు రక్షణ కల్పించాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలిచ్చింది.
ప్రజ్ఞారెడ్డిని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, భర్త ఏక్‌నాథ్‌రెడ్డి, అత్తమామలపై ఆరోపణలున్నాయి. కోడలిపై కోపంతో ఆమె గది తలుపు దగ్గర రాత్రికిరాత్రి అత్తామామలు గోడకట్టారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ప్రజ్ఞారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కొంతకాలంగా ఏక్‌నాథ్‌రెడ్డి దంపతుల మధ్య కలహాలు తలెత్తాయి. భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ఏక్‌నాథ్ అడ్డుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి.
Polavaram Project: పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు పనులు.. రెండు రోజుల్లోనే పూర్తి
అంతేకాదు.. ఏకంగా రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడ నిర్మించారు. పోలీసులు ఏక్‌నాథ్‌పై వరకట్న వేధింపులు, గృహహింస కేసులు నమోదు చేశారు. ఏక్‌నాథ్ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి పుల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏక్‌నాథ్‌రెడ్డి వివాహ రిసెప్షన్ మార్చి 2014లో అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని జేఆర్‌ఎసీ కన్వెన్షన్‌లో జరిగింది. ఏక్‌నాథ్ రెడ్డి భార్య తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటాడు. పేరున్న కుటుంబం కావడంతో జి.పుల్లారెడ్డి ఫ్యామిలీతో వియ్యం అందుకున్నారు. కానీ.. ఇలా కూతురిని తన అల్లుడు ఇబ్బంది పెడతాడని ఆయన ఊహించలేకపోయారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. పంజాగుట్ట పోలీస్ అధికారులు ప్రజ్ఞా రెడ్డికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించారు. అంతేకాకుండా కోర్టు అధికారులతో వెళ్లి అడ్డుగా ఉన్న గోడను తొలగించారు. తాను ఆస్తి కోసం పిటిషన్ వేయలేదని, తన హక్కుల కోసం పోరాటం చేస్తున్నా అంటోంది ప్రజ్ఞారెడ్డి. న్యాయస్థానం ప్రజ్ఞా రెడ్డి ఫిర్యాదు మేరకు ఇంటిలో స్వేచ్ఛగా తిరిగేందుకు అడ్డుగా ఉన్న గోడను తొలగించమని కోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని జిల్లా ప్రొటెక్షన్ అధికారి తెలిపారు.
.