బడ్జెట్ కేటాయింపులపై నేటి నుంచి శాసనసభలో చర్చ జరగనుంది. మూడు రోజుల పాటు బడ్జెట్ అంశాలపై చర్చ జరగనుంది. తొలిరోజు సంక్షేమం, రోడ్లు-భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, పర్యాటకం, క్రీడా శాఖలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చ జరగనుంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు.