PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు.. సుదీర్ఘంగా కొనసాగింది. ప్రగతి మైదాన్ భవన్‌లో ప్రధాని మోడీ అధ్యక్షతన మొదటి సారి మంత్రి వర్గ సమావేశం జరిగింది. భారతీయ జనతా పార్టీ 9 ఏళ్ల పాలన, సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అటు.. సమావేశం సక్సెస్ అయిందని ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. వివిధ అంశాలను అభిప్రాయాలను పంచుకున్నామని పేర్కొన్నారు.
ఇక, కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్ భవన్‌లో జరిగిన ఈ భేటీకి కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు, సహాయ మంత్రులు, ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే, ఈసారి విధానపరమైన నిర్ణయాలేమీ లేవు. తొమ్మిదేళ్ల పాలన, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతోపాటు వచ్చేఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యాతాంశాలు, ఈ నెల 20న ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, కీలక బిల్లులు సహా పలు ముఖ్య విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర మంత్రి మండలిలో జరిగే మార్పులు, చేర్పులపై కూడా ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.
Read Also: Girl Suicde: ”చదువు ఇష్టం లేదు”.. సూసైడ్ నోట్ రాసి బాలిక ఆత్మహత్య
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది.. త్వరలో కొన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంపై కూడా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. వచ్చే శుక్రవారం వరకు కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర పర్యటనలో ఉండబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జులై 7వ తేదీ తర్వాతనే ఢిల్లీకి తిరిగి రానున్న వెళ్లనున్నారు.. ఈ వారాంతంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు.. వచ్చే శని, ఆదివారం నాడు కేంద్ర మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. లేకపోతే, ఆగస్టు 11 న వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాతనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం. జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో, కొత్తగా బాధ్యతలు చేపట్టే మంత్రులకు ఆయా శాఖలపై అవగాహన కలిగేందుకు సమయం ఉండాలనే ఆలోచనలో అధికార బీజేపీ అగ్రనాయకత్వం ఉందట.. ఇక, బీజేపీ సంస్థాగత మార్పులతో పాటు, కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒకేసారి మార్పులుంటాయని సమాచారం.
A fruitful meeting with the Council of Ministers, where we exchanged views on diverse policy related issues. pic.twitter.com/NgdEN9FNEX
— Narendra Modi (@narendramodi) July 3, 2023