కొన్నిసార్లు జరిగే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా పెద్ద తిప్పలు వస్తుంటాయి. బతికున్నా సరే బతికున్నామనే సర్టిఫికెట్ కావాలని అడిగే ఈరోజుల్లో, బతికున్న వ్యక్తికి డైరెక్ట్‌గా ఫోన్‌చేసి మీ డెత్ సర్టిఫికెట్ రెడీ అయింది వచ్చి తీసుకెళ్లండి అని అడిగే రోజులు వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. అది పొరపాటు కావోచ్చు మరేదైనా కావోచ్చు. ఇలాంటి పరిస్థితి థానేలోని మాన్ పడాలో టీచర్ పనిచేస్తున్న చంద్రశేఖర్ కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. ట్రీట్‌మెంట్ తీసుకొని కోలుకున్నారు. అయితే, అధికారులు రోజూ ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని ఆరా తీస్తుండటంతో తన ఆరోగ్యం గురించి మంచి నిర్ణయం తీసుకున్నారని అనుకున్నాడు. ఓరోజు థానే మున్సిపాలిటీ నుంచి ఫోన్ చేసి డెత్ సర్టిఫికెట్ రెడీగా ఉంది తీసుకెళ్లమని చెప్పడంతో ఆయన షాక్ అయ్యాడు. తాను బతికే ఉన్నానని చెప్పడంతో అధికారులు కాల్ కట్ చేశారట.