ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి భారీగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 71,532 శాంపిల్స్ పరీక్షించగా.. 1,601 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది మృతి చెందారు. చిత్తూరులో ఆరుగురు, తూర్పో గోదావరి, కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. ఇదే సమయంలో 1,201 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో…
ఏపీలో జూనియర్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది ప్రభుత్వం. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.15,000 ఇతర గ్రూపులకు రూ.12,000 గా నిర్ధారించింది. ఇక మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500 ఇతర గ్రూపులకు రూ.15,000 గా… అలాగే కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000 ఇతర గ్రూపులకు రూ.18,000 గా స్పష్టం చేసింది. అయితే కరోనా కారణంగా గత…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 389 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు.. ఇక, 420 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,55,732 కు చేరగా.. రికవరీ కేసులు 6,45,594 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాలలోనూ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. తమిళనాడు లాంటి చోట్ల 23 నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకున్నాయి. ఏపీలోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతోనే ఇప్పటికీ నడుస్తున్నాయి. అదీ రోజుకు మూడు ఆటలతోనే! చిత్రం ఏమంటే… జనాలను థియేటర్లకు తీసుకొచ్చే మాస్ హీరో సినిమా ఏదీ ఇంతవరకూ విడుదల కాకపోవడంతో తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినా… చాలా థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. జంట థియేటర్లు ఉన్న…
వచ్చే నెల 1 నుండి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ విషయం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం…
తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 74,634 శాంపిల్స్ పరీక్షించగా… 354 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 427 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,55,343కు పెరగా.. 6,45,174 మంది బాధితులు పూర్తిస్థాయిలో రికవరీ అయ్యారు..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో 47,972 శాంపిల్స్ పరీక్షించగా.. 1,002 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 12 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఒకేరోజు 1,508 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో నేటి వరకు 2,61,39,934 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల…
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యాయి. వారం రోజుల నుంచి చిన్నారులు స్కూళ్లకు వెళ్తున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడంతో అందులో చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. నాడునేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లకు అధునాతనమైన సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం. ఇక ఇదిలా ఉంటే, ఏపీలో కరోనా కేసులు ప్రతిరోజూ వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. స్కూళ్లలోనూ కేసులు నమోదవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న డీఆర్ఎం మున్సిపల్ స్కూళ్లో ప్రధానోపాధ్యాయుడు, ముగ్గురు…
భారత్ కరోనా పాజిటివ్ కేసులు మరింత తగ్గాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,948 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 403 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఒక, ఒకేరోజులో 38,487 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,24,234కు చేరుకోగా.. ఇప్పటి వరకు 3,16,36,469 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి…