విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేసారు ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకూ ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. పిల్ పై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నారు తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం. అయితే కరోనా…
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే. స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం బాగానే ఉన్నా.. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలే సర్పంచ్‌లకు టెన్షన్ పెడుతున్నాయట. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ప్రభుత్వం నుంచి పైసా రాదు. స్కూళ్లు సాఫ్ చేయకపోతే.. జేబులు సఫా. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదట సర్పంచ్‌లకు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వ ఆదేశాలతో సర్పంచ్‌లు ఉలికిపాటు! తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. విద్యార్థులకు తరగతి…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 325 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 424 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,119 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,185 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,869 కు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ… పెరుగుతూ వస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో 54,455 శాంపిల్స్ పరీక్షించగా.. 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఒకేరోజు 1,499 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో నేటి వరకు 2,64,71,272 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నమోదైన…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 80,568 శాంపిల్స్ పరీక్షించగా… 339 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 417 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 357 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్కరు మృతిచెందారు.. ఇక, 405 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,455 కు చేరగా.. రికవరీ కేసులు 6,46,344 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,865 గా ఉంది..…
చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ ఉంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల పునః ప్రారంభానికి నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము, ఇక నుండి ఆఫ్ లైన్ లో తరగతులు ఉంటాయి. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్…
దేశంలో మరోసారి కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 46 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా 11 వేలకు పైగా కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తం అయింది. నమోదైన 46,164 కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 31,445 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ కేరళలో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాజిటివ్…
భారత్‌లో కరోనా మహమ్మారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్ట్, డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. ఇండియాలో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మరికొన్నిరోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందన్నారు. 2022 ఆఖరు నాటికి.. 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తై, కోవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని చెప్పారు. భారతదేశంలో కోవిడ్ -19 ఇప్పుడు స్థానిక దశకు చేరుకుంటోంది. దాని వ్యాప్తి రేటు మునుపటి కంటే చాలా నెమ్మదిగా ఉంది..…
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ వచ్చినా.. కేరళలో మాత్రం భారీగానే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూ వచ్చాయి.. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూవాయి.. కేరళ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,445 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 215 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19.03గా నమోదైంది.. మళ్లీ కోవిడ్…