ఏపీ గవర్నర్ కరోనా నుంచి కోలుకున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుంటారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఢిల్లీ పర్యటన తరువాత కరోనా లక్షణాలు బయటపడటంతో హైదరాబాద్ ఏఐజీ లో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడతంతో ఆయన రేపు మధ్యాహ్నం రాజ్ భవన్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో చికిత్సపొందుతున్న సమయంలో ఆయన్ను తెలంగాణ గవర్నర్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్‌కు వైద్యం అందిస్తున్న వైద్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యవివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
Read: భార్యకు తాజ్ మహల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త…