Jaya Kishori: సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి క్లారిటీ
- సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి క్లారిటీ
- సూత్రాల ప్రకారమే నడుచుకుంటానని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శల పాలయ్యారు. 29 ఏళ్ల వయసులోనే ఆధ్మాత్మిక బోధనలతో.. భజన పాటలతో దేశ వ్యాప్తంగా మంచి ఫేమస్ అయ్యారు. మానవ జన్మ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. డబ్బుపై వ్యామోహం ఉండకూడదని.. ఎముకల గూడుకు ఆడంబరాలు.. భోగభాగ్యాలు ఉండకూడదని బోధిస్తుంటారు. ఈమె ప్రసంగాలకు లక్షలాది మంది ఫాలోయింగ్ ఉన్నారు. తాజాగా ఎయిర్‌పోర్టులో ఆమె భక్తులకు తారసపడింది. ఆ సమయంలో ఆమె తీరును చూసిన భక్తులు అవాక్కయ్యారు. లగ్జరీ లైఫ్‌ను చూసి నిర్ఘాంతపోయారు. లగేజీ బ్యాగ్‌పై ఉన్న హ్యాండ్ బ్యాగ్ చూసి నిన్వెరపోయారు. హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 2లక్షలకు పైగా ఖరీదు ఉంటుంది. డియోర్ బుక్ నోట్ అనే బ్యాగ్‌పై తన పేరును కూడా రాయించుకున్నారు. అంతేకాకుండా రూ.13లక్షలకు పైగా ఖరీదైన వాచ్‌ను కూడా ధరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనాలకేమో నీతి వాక్యాలు.. తమరికేమో లగ్జరీ లైఫా? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. మతాన్ని అడ్డంపెట్టుకుని కొందరు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంటారని కామెంట్ చేశారు. ఆమె మతపరమైన వక్త కంటే గ్లామరస్ అమ్మాయి అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
తాజాగా ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ అంశంపై జయ కిషోర్ మీడియాతో స్పందించారు. బ్రాండ్‌లను చూసి బ్యాగ్‌లు ఉపయోగించనన్నారు. నచ్చితే ఎక్కడికైనా వెళ్లి కొనుకోవచ్చన్నారు. తన దగ్గర కొన్ని సూత్రాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో ఒకటి తోలుతో చేసినవి ఉపయోగించనని చెప్పారు. అయినా ఆ బ్యాగ్ ఎప్పుడూ ఉపయోగించలేదన్నారు. తనకు ఏదైనా నచ్చితే కొంటానన్నారు. బ్యాగ్ అనుకూలంగా ఉండడంతో కొన్నట్లు తెలిపారు. మీరు కూడా బాగా కష్టపడి డబ్బు సంపాదించాలని తాను చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మీ కుటుంబానికి సౌకర్యవంతమైన జీవితం అందించాలని తెలిపారు.
‘‘నేను సాధారణ అమ్మాయిని, సాధారణ ఇంట్లోనే ఉంటున్నాను, కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను.. మీరు కష్టపడి సంపాదించండి, డబ్బు సంపాదించండి, మీరే ఇవ్వండి అని యువతకు అదే మాట చెబుతున్నాను. మంచి జీవితం, మీ కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వండి మరియు మీ కలలను నెరవేర్చుకోండి.” అని జయ పేర్కొన్నారు.
జయ కిశోరికి ఇన్స్టాగ్రాంలో ఉన్న పాపులారిటీ ఉంది. మోటివేషన్ స్పీకర్కు 12.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలు ఆమె ఇన్స్టాలో ఉన్నాయి.
#WATCH | Kolkata: On the controversy over carrying an expensive handbag, Spiritual orator Jaya Kishori says, "One does not use brands just by looking at them. You go somewhere and if you like something, you buy it. I have some principles, one of which is that I do not use… pic.twitter.com/Q75ckAVoAt
— ANI (@ANI) October 29, 2024
Spiritual preacher Jiya Kishori deleted her video where she was carrying a Dior bag worth ₹ 210000 only
btw she preach Non-Materialism & call herself as Devotee of Lord Krishna.
One more thing : Dior makes bag by using Calf Leather 🐄
— V🐧 (@Vtxt21) October 25, 2024
Meet Jaya Kishori, she preach Non – Materialism during her religious preaching
But in private she often seen using expensive items like Dior bags, Rolex watch etc. Hypocrisy 🙃 pic.twitter.com/gdl3OGq4O9
— V🐧 (@Vtxt21) October 27, 2024
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?