Mock Assembly: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారమే విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
విద్యా శాఖలో వచ్చే ఏడాది నుంచి, ప్రతి విద్యార్ధికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తాం. రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి నారా లోకేష్..
ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం.. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఛీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు..