Mock Assembly: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారమే విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాలతో సభను స్పీకర్ ప్రారంభించారు. సాధారణ అసెంబ్లీలో జరిగే విధంగానే క్వశ్చన్ అవర్ మాదిరిగానే.. మాక్ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ చేశారు. విద్య శాఖ, రవాణా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలతో పాటు మత్స్యకారులకు వేటా నిషేద సమయంలో చెల్లించే పరిహారం వంటి ప్రశ్నలను సభ్యులు సంధించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల హోదాలోని విద్యార్థులు సమాధానాలు చెప్పారు. విద్య రంగానికి సంబంధించిన కొన్ని బిల్లులు పాస్ చేయడం ద్వారా బిల్లులపై అవగాహన కల్పించారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా తిలకించారు.
Read Also: UPSC Centenary Celebrations: 100 ఏళ్లు పూర్తి చేసుకున్న “యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్”..
ఇక, శాసనసభ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్ వ్యవహరించారు. ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య ఉంది. ఇక, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, అసెంబ్లీలో స్పీకర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి, విద్య శాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి వ్యవహరించారు. ఈ సందర్భంగా పలు బిల్లులు ప్రవేశ పెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ జరిపారు. సామాజిక మాధ్యమాల నియంత్రణపై.. విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలికంగా అసెంబ్లీలో చర్చించారు.