EX MLA Jagga Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటెల రాజేందర్ వి నాన్సెన్స్ కామెంట్స్.. రండ అంటే అర్థం ఏంటో చెప్పు ఈటల అని ప్రశ్నించారు. అర్థం చెబితే.. దానికి సమాధానం చెప్తానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డినీ అన్నా.. కాంగ్రెస్ నీ అన్నా ఒక్కటే.. ప్రతీ పనికి మాలిన మాటలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నేను 19 ఏండ్ల క్రితం కౌన్సిలర్ నీ అయ్యాను.. అప్పుడు ఈటల ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. నేను కౌన్సిలర్ అయినప్పుడు ఆయన చదువుకుంటున్నాడు.. నీ పర్సనాలిటీ ఎంత?.. నీకు నువ్వే ఎక్కువ ఫీల్ కాకు.. అంత అవసరం లేదు అని జగ్గారెడ్డి సూచించారు.
Read Also: Viral Video: పాకిస్తానీ మిరాజ్ ఫైటర్ జెట్ కూల్చివేత.. వీడియో వైరల్..
అయితే, రౌడీలకు రౌడీ నీ.. మంచోడికి మంచివాడ్ని నేను అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే.. ఈటల ఎవరు?.. ఎవరో పుణ్యమా అని లీడర్ అయ్యావు నువ్వు అని ఎద్దేవా చేశారు. నీకే అంత ఉంటే, మాకు ఎంత ఉండాలి అన్నారు. నువ్వు ఒక్క తిట్టు తిడితే వంద తిడతం మేము. కంట్రోల్ లో ఉండి పరువు దక్కించుకో.. కాంగ్రెస్ పార్టీ వయసు ఎంత.. నీ వయసు ఎంత అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ముని మనవడివి.. నా సంగతి తెలియాలంటే కిషన్ రెడ్డినీ, వెంకయ్య నాయుడిని, భగవంత్ రెడ్డినీ అడగండి అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో నాకంటే చిన్న పిల్లగాడు.. ఈటల బీఆర్ఎస్ లో పెద్ద నసగాడు.. అందుకే ఈ నసగాడితో ఎందుకు అని కేసీఆర్ బయటకు పంపించారు.. నేను మీ లెక్క హైబ్రిడ్ రకం కాదు.. నాటు రకం అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.