కొత్త పీసీసీ చీఫ్ రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో సమీకరణాలు మారతాయా? ఆ మాజీ మంత్రి చుట్టూ ఎందుకు చర్చ జరుగుతోంది? రేవంత్ వర్గం దూకుడు దేనికి సంకేతం? 2018లో కాంగ్రెస్ టికెట్ కోసం దామోదర్‌రెడ్డి పోరాటం! రాంరెడ్డి దామోదర్‌రెడ్డి. మాజీమంత్రి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆయనకు కేడర్ ఉంది. కానీ.. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు.. స్థానిక రాజకీయ పరిణామాల కారణంగా 2014 నుంచి గెలిచింది…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు ఉండగానే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసి… కార్యాచరణ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎవరికి వారు… తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ షెడ్యూల్ సిద్ధంచేసుకుంది. ఇక షర్మిల కూడా అదే బాటలో నడుస్తుంది. పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి కూడా… తన నడకను మొదలుపెట్టాలని…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.. కేటీఆర్ మరోసారి ఇలా రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం.. జాగ్రత్త అని హెచ్చరించారు.. కేటీఆర్ ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు అంటే .. దానికి కారణం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వబట్టేనని గుర్తుచేసిన ఆయన.. చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇక, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను పూర్తిగా నాశనం చేశారని ఫైర్ అయిన సంపత్.. కాంగ్రెస్ చిన్న…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యాక దూకుడును పెంచారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగం, పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకున్నా, ఆ సమస్య తీరకపోగా మరింత ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది. Read: పాత్రల్లో పరకాయప్రవేశం…
కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఎంపీ , టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ… సోనియాగాంధీ , రాహుల్ గాంధీ ప్రోత్సహంతో తెలంగాణ రాష్టానికి 6 సంవత్సరాలపాటు పిసిసి అధ్యక్షులుగా సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా వివిధ పార్టీల వారు మా కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న ప్రతి కాంగ్రెస్…
కేసీఆర్‌పై ఆరోపణలు, విమర్శలు చేసి గెలవాలంటే అది సాధ్యం కాదని.. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమిస్తేనే అది సాధ్యమంటూ సలహా ఇచ్చారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్లో ఇవాళ సింగరేణి బీఎంఎస్ ప్రిసెడెంట్ మల్లయ్య.. టీఆర్ఎస్లో చేరారు.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సందర్భంగా విపక్షాలపై సెటైర్లు వేశారు.. మార్కెట్ లోకి కొత్త బిచ్చగాళ్ల వచ్చారు… వాళ్లు ఎవరో మీకు తెలుసన్నారు.. నిన్న మొన్న పదవులు…
గాంధీ భవన్ వేదికగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతోంది.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్… అనేక విషయాలను ప్రస్తావించారు.. కేసీఆర్ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని మండిపడ్డ ఆయన.. మరోవైపు బీజేపీపై కూడా విమర్శలు చేశారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా స్పందించారు..…
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షభానికి తెరదించేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ… ఢిల్లీ వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమెతో చర్చలు జరిపారు.. అంతర్గత విభేదాలతో, సంక్షోభంలో పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ సతమతమవుతోంది.. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తో ఢీ అంటున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ రోజు ఉదయం కూడా “బూటకపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల” వల్ల పంజాబ్ ప్రజల పై వేల కోట్ల రూపాయల అధిక భారం మోపారని…