కేంద్ర తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపేర్కొన్నారు. దేశంలో ఇప్పటి విపత్కర పరిస్థితులకు ఎవరు కారణమో అందరికీ తెలుసునని అన్నారు. దశాబ్ధాలుగా నిర్మించిన వాటిని కొన్ని సెకన్ల వ్యవధిలో కూల్చివేశారని విమర్శలు చేశారు. ఎల్ఒసీ, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వివాదాలు, నిత్యవసర ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, కరోనా వ్యాక్సిన్ల కొరత తదితర అంశాలకు కారణం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలే అని అన్నారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల…
పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఓ కొలిక్కి వచ్చాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిద్దూ అనతి కాలంలోనే పార్టీలో మంచి పట్టు సాధించారు. అయితే, కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, సిద్దూ వర్గంగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. ఈ తగాదాలు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. సిద్దూకి కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. ముఖ్యమంత్రిగా అమరిందర్ సింగ్ కొనసాగనున్నారు. దీంతో పంజాబ్‌లో గొడవకు…
ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్ ఎక్కే మెట్టు దిగే మెట్టుగా మారిందా? కొత్త నిర్ణయం కలిసి వస్తుందా? ఉన్నచోట ఎందుకు ఇమడ లేకపోయారు? కొత్త పార్టీలో ఎదురయ్యే సవాళ్లేంటి? ఎవరా నాయకుడు? కాంగ్రెస్‌లో ఎర్ర శేఖర్ కొత్త ప్రయాణం ఎలా ఉంటుంది? బీజేపీకి పాలమూరు జిల్లాలో గట్టి షాకే తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారాయన. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన…
రాహుల్ గాంధీ.. త్వరలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి చేపడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది.. అయితే, ఆ బాధ్యతలను ప్రస్తుతానికి సోనియా గాంధీ చూస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్యంగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.. ఇక, ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో.. అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయినట్టు…
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు నేషనల్ వైడ్ గా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా సోనియా గాంధీ కుటుంబంతో మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించినట్లు అంత అనుకున్నారు. కాగా, తాజా సమాచారం మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు..…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయనను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం.. ఆయన కూడా రెడీగా ఉన్నట్టు వారి మాటల్లో అర్థం అవుతోంది.. కొండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. బీజేపీలో చేరడం ఖాయం అనే ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడానికే ఉత్సాహంగా ఉన్నారని అర్థం అవుతోంది.. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో…
హుజురాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.. కానీ, అప్పుడే ఉప ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. ఓవైపు.. టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ విజయం సాధిస్తానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి పావులు కదుపుతున్నారు.. ఇదే సమయంలో.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన కౌశిక్‌రెడ్డి ఆడియో సంచలనం సృష్టించింది.. ఆ వెంటనే షోకాజ్ నోటీసులు, రాజీనామా,…
ఆయనో మాజీ ఎంపీ. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. భవిష్యత్ ప్రయాణం ఏంటో వెల్లడించలేదు. కాసేపు అటు.. మరికాసేపు ఇటు అన్నట్టు ఆయన ట్వీట్లు ఉంటున్నాయా? ఇంతకీ ఆయన ఆ గట్టున ఉంటారా.. ఈ గట్టున రిలాక్స్ అవుతారా? క్రాస్‌రోడ్స్‌లోనే ఉండిపోయారా? కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. టీఆర్ఎస్లో ఉండగా.. చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో రాజకీయంగా లక్ కలిసి రాలేదు. ఇక అక్కడ ఉండటం అవసరం లేదనుకున్నారో…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… తాజాగా.. తాను వ్యూహాలు అందించిన పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తిరిగి అధికారంలోకి రాగా.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే, తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన పీకే.. ఆ తర్వాత వరుస భేటీలతో పొలిటికల్ హీట్ పెంచారు.. శరద్ పవార్ లాంటి సీనియర్ రాజకీయ నేతను ఆయన కలవడం.. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా..…