పార్లమెంట్ సమావేశాలకు ముందు పెగాసస్ అంశం దేశాన్ని అతలాకుతలం చేసింది. పెగాసస్ స్పేవేర్‌తో దేశంలోని ప్రముఖులపై కేంద్రం నిఘా ఉంచిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించాలని పట్టుబడుతున్నాయి. అయితే, ఈ అంశాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది. పెగాసస్ అంశం చర్చకు తీసుకురాకుండా మిగతా అంశాలను చర్చించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నది. Read: బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ కానీ, అందుకు ప్రతిపక్షాలు…
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోనే భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి పైలాన్ ను కూడా ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు సురక్షిత నది జలాలు వచ్చాయని….ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారని..ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత అని కొనియాడారు. ఇంటింటికి సురక్షిత నది…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనది గుర్తుచేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడులో నివాళులర్పించారు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు.. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం…
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హస్తిన పర్యటనలో బిజి బీజీగా ఉంది. మిషన్ మోడీ ఉద్వాసనకు రంగం సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పెగసస్ స్పైవేర్ ఆరోపణలు, పెట్రో ధరల పెంపు సహా కీలకాంశాలపై… పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చించే అవకాశముంది. పెగసస్ స్పైవేర్‌లో మమత పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ పేరుండడం.. దీన్ని కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ గాంధీ దృష్టిసారించారు.. రాహుల్‌తో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం.. రాష్ట్రానికి చెందిన పలు సీనియర్లకు జాతీయస్థాయులో పార్టీలో బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారని చెబుతున్నారు.. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు..…
రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంతర్గత సమస్యలకు చెక్ పెట్టి, అందర్ని ఏకం చేసేలా, అందరి మధ్య రాజీ కుదిర్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్. పంజాబ్‌లో ఈ విషయంలో దాదాపుగా విజయం సాధించిందని చెప్పాలి. పంజాబ్‌లో ముఖ్యనేతలైన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించింది. సిద్ధూకు పంజాబ్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో అక్కడ సమస్య చాలా వరకు ఓ కొలిక్కి…
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆ మాజీ ఎమ్మెల్యే మనసు మార్పు కోరుకుంటుందా? బ్యాక్ టు పెవీలియన్ అని వచ్చేస్తారా? అనుచరుల మాటేంటి? మాజీ ఎమ్మెల్యే మాట వింటారా? రాం రాం చెబుతారా? ఇదే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో ఆసక్తిగా మారింది. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా? బీజేపీలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటూ వెళ్లిన చాలా మంది కాంగ్రెస్ నాయకులు తిరిగి వెనక్కి వచ్చేయడానికి చూస్తున్నరనే చర్చ తెలంగాణలో జోరందుకుంది. ఇప్పటికే కొందరు బీజేపీకి గుడ్‌బై…
తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలలో విశ్వాసం పోయిందన్న ఆయన.. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారన్నారు.. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ వ్యతిరేకుల పునరేకీకరణ జరుగుతుందన్న రేవంత్… సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సమాజం త్వరలో తిరస్కరిస్తుంది.. మేధావులు, మీడియా దీన్ని గమనించాలని సూచించారు.. ఇక, రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీని వీడి…