టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రౌడీ సీట్ ఓపెన్ చేయాలి.. కాంగ్రెస్ నేత డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ… కల్వకుర్తిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నాం అన్నారు.. ఇక, సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించిన ఆయన.. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రిని దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదు..? సీఎం అంటే మీకు భయమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయంలో దళితులకు భూ పట్టాలు ఇస్తే.. వాటిని టీఆర్ఎస్ గవర్నమెంట్ గుంజుకుంటుందని విమర్శించారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినం కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారంటూ ఘాటుగా కమెంట్ చేశారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ దళిత బంధుకి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన వంశీ కృష్ణ.. కేవలం హుజురాబాద్ లోనే కాకుండా రాష్ట్రం మొత్తం దళితబంధును ఇవ్వాలని డిమాండ్ చేశారు.. టీఆర్ఎస్ నాయకులు మతిస్థిమితం లేకుండా అధికారం, భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని సెటైర్లు వేసిన ఆయన.. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ ఒక రౌడీ లాగా వ్యవహరిస్తున్నాడని… అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు గువ్వల బాల్ రాజ్.. గుంతల బాల్ రాజ్.. గువ్వల బాల్ రాజ్ కాదు.. గుప్తనిధుల బాల్ రాజ్ అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ దళితులకు భూ సంస్కరణలు చేసిన పార్టీ అని గుర్తుచేశారు వంశీ కృష్ణ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆంధ్రకు తరలిస్తే కమిషన్ లకు కక్కుర్తి పడి అడ్డుకోలేక పోతున్నారంటూ టీఆర్‌ఎస్ నేతలపై ఆరోపణలు గుప్పతించిన ఆయన.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకులు భేషరత్ గా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.. సీఎం మెప్పు కోసం మాట్లాడే మాటలను టీఆర్ఎస్ నేతలు బంద్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.
Also Read
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!