ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ విజయంవతం అయిన తర్వాత టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై సెటైర్లు వేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్.. ఇంద్రవెల్లి సభ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందనే నమ్మకం కలిగిందన్న ఆయన… కానీ, టీఆర్ఎస్ నేతలకు మాత్రం సురుకు తగిలిందన్నారు.. అందుకే అందరూ నేతలు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు.. కొత్త చైతన్యంతో కాంగ్రెస్ నేతలు అన్ని నియోజకవర్గాలలో దండోరా వేయడానికి సిద్ధం అవుతున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పాటపడింది.. ఆట ఆడింది దళిత, గిరిజన బిడ్డలు మాత్రమేనని గుర్తు చేశారు.. ఇక, సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా ఎస్సీ, ఎస్టీ స్లబ్ ప్లాన్ ఖర్చు చేయలేదని.. అలా చేస్తే ఇప్పుడు దళిత బంధు అవసరమయ్యేదా…? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లు కేవలం కాళేశ్వరానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించారని విమర్శించారు దాసోజు శ్రవణ్.