ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటీకి వచ్చినట్టే వస్తారు.. ఇంతలోనే కొత్త స్టేట్మెంట్ ఇస్తారు. ఎదుటివారికే కన్ఫ్యూజన్. ఇప్పుడు మరింత స్పష్టత కోసం ఫోకస్ పెట్టారట. కలిసి నడుస్తారో లేక.. కాదూ కూడదనే అంటారో కానీ.. ఢిల్లీ భేటీలతో పార్టీలో చర్చగా మారారు. ఢిల్లీ డెవలప్మెంట్తో చర్చల్లోకి వచ్చిన రాజగోపాల్‌రెడ్డి! రాజకీయ వ్యూహాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎత్తుగడ ఎవరికీ అంతు చిక్కదు. వాళ్ల వరకు క్లారిటీతో ఉంటారో లేదో.. కేడర్ మాత్రం కన్ఫ్యూజ్లో ఉంటుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి…
అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఒక్క ఓటమితో సోదిలో లేకుండా పోయారు. అన్నీ వరస ఎదురుదెబ్బలే. పార్టీని కాదని వేస్తున్న పొలిటికల్ స్టెప్పులు తడబడుతున్నాయి. ఇప్పుడు సీటుకే ఎసరొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ మాజీ మంత్రి దారెటు అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? ఐదుసార్లు గెలిచిన చోట సీటుకు ఎసరొచ్చిందా? జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్‌లో.. టీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు.. ప్రస్తుతం చర్చల్లో కూడా లేరు. ఉమ్మడి మహబూబ్‌నగర్…
క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు… రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం దుర్మార్గం అన్నారు.. గాంధీ కుటుంబంపై ఉన్న కక్షతోనే పేరు మార్చారని…
సీఎం కెసిఆర్ కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. గురుకుల పాఠాలల్లో ప్రవేశం లో 75% ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఉండే విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయింపు మంచి నిర్ణయమని తెలిపారు. కానీ గురుకుల ప్రవేశ పరీక్ష విధానం తో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోతున్నారని… ప్రైవేటు స్కూల్ లో చదివి పోటీ…
ఒకే పార్టీలో ఉన్నారు.. ఒకే జిల్లా నాయకులు. కానీ.. నేతలిద్దరూ తూర్పు-పడమర. మాట మాట్లాడితే ఉప్పు-నిప్పులా ఉంటుంది యవ్వారం. ఆధిపత్యం కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న సమయంలో కొత్త రగడ తెరపైకి వచ్చింది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ నేతల మధ్య పాత పగలు.. సెగలు రాజేసిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ చిచ్చు పెట్టడంతో పార్టీలో అందరి దృష్టీ.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి..…
హుజురాబాద్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ లో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా మార్చుకున్నరు కేసీఆర్. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పార్టీ కి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.. అది నాతో సహా అని తెలిపారు. ఇక ఆగస్టు 9న ఇంద్రవెళ్లిలో దళిత, గిరిజన దండోరా జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు…
పంతం నీదా..నాదా అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ. చూస్తుండగానే పెద్ద సవాల్‌గా మారిందీ సమస్య. సభ నిర్వహిస్తామని ఒకరు.. వద్దని ఇంకొకరు భీష్మించడంతో పార్టీలో చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు ఆధిపత్యానికి పోటీ పడుతుండటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రేవంత్, మహేశ్వర్‌రెడ్డిల మధ్య ఇంద్రవెల్లి సభ చిచ్చు! దళిత గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవ దండోరాకి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా నాయకుల మధ్య పంచాయితీ.. ఏకంగా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో…
రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 14 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు హాజరయ్యారు. కేంద్రంపై ఉమ్మడిపోరును సాగించేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా పెగాసస్ స్పైవేర్ అంశంపై విపక్షాలు పట్టుబడుతున్నారు. దీంతో పాటుగా ప్రజాసమస్యలపై ఉమ్మడిగా పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాయి. బిల్లులపై సమగ్రంగా చర్చించకుండానే ఆమోదించుకోవడంపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. Read: సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించింది తెలంగాణ కేబినెట్. అయితే గత కాలంగా తెలంగాణలో రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెరాస లో చేరారు. దాంతో అక్కడ తెరాస తరపున టికెట్ ఆయనకే ఇస్తారు అనే…
కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె…