ఇన్నాళ్లూ అతనొస్తే… టైమ్ ఇవ్వలేదు తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు. ఇప్పుడు మాత్రం ఆ నేత చుట్టూ ఒక్కటే ప్రదక్షిణలు. ఇంటికి పిలిచి మరీ కుశల ప్రశ్నలు వేస్తున్నారట. ఇంతకీ ఆ నేతకు టైమ్ వచ్చిందని అనుకుంటున్నారా? కానే కాదు.. తమ టైమ్ బాగుండాలని జాగ్రత్త పడుతున్నారట నాయకులు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఓటమిపై అభ్యర్థి వెంకట్నే నివేదిక కోరిన హైకమాండ్..! 13న ఢిల్లీ AICC ఆఫీసులో ఏర్పాటు చేసిన మీటింగ్‌పైనే ఫోకస్ పెట్టారు తెలంగాణ…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ వైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్న సమయంలో.. ఆయన చేసిన కామెంట్లు పార్టీలో కలకలం రేపుతున్నాయి.. సమన్వయ లోపమే హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణంగా తేల్చిన ఆయన.. గతంలో పీసీపీ అధ్యక్షులుగా ఉన్న కె. కేశవరావు (కేకే), డి. శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్‌ను మోసం చేశారని మండిపడ్డారు.. మరోవైపు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి ఆరోపించారు. రైతులు పండించిన పంటను ప్రతీసారి రాష్ర్ట ప్రభు త్వమే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు రైస్ మిల్లర్లకు సరఫరా చేసి ఎఫ్‌సీఐకి లేవీ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ ద్వారా డబ్బులు తీసుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర…
తెలంగాణ ధాన్యం కొనుగోలు రచ్చ జరుగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్స్ నేతలే రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలేమో రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు చేతకాక కల్లబొల్లి కబుర్లు చెబుతోందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనాల్సిన వాళ్ళే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని, మీకు చేత కాక చేతులు ఎతేశరా..? మాకు రాష్ట్ర పాలన చేత…
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు…
తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి… ఆ పార్టీ నాయకులు ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయబోతున్నారు. కేంద్రం ధాన్యం కొనాలని అధికార ప్రభుత్వ నాయకులు ధర్నా కి దిగుతున్నారు అని వీ.నుమంతరావు చెప్పారు. ధర్నా చౌక ఎత్తేశారు కదా… ఇప్పుడు అదే ధర్నా చౌక వద్ద దర్నా కి దిగుతున్నారు. ధర్నా చౌక ఎత్తేస్తే నెను కోర్ట్ లో పిటిషన్ వేశాను. రైతుల పట్ల కేసీఆర్ కి చిత్త శుద్ధి ఉంటే..నల్ల చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చెయ్…
పోడు భూముల పై నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్టు కాంగ్రెస్ పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ట్రైబల్ పేరుతో టీ.ఆర్.ఎస్ నేతలు బినామీలతో వందల ఎకరాలను కబ్జా చేయాలని చూస్తు న్నారని ఆయన ఆరోపించారు. కలిసొచ్చే పార్టీలతో వాచ్ డాగ్ మాదిరిగా లోకల్‌గా నిఘా పెడతామని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక కమిటీ వేశామని, దామోదర రాజనర్సింహా, చిన్నారెడ్డి, బలరాంనాయక్…
ఇటీవలి లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిరాశ మిగిల్చాయి. మోడీ ప్రభుత్వ వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయి. పెట్రో ధరలు. రైతు ఆందోళనలు.. నిరుద్యోగం. తగ్గిన మోడీ గ్రాఫ్. ఈ అంశాలన్నీ ప్రభావం చూపాయనటంలో అనుమానం లేదు. మామూలుగా అయితే ఈ ఫలితాలను బీజేపీ పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ కొన్ని నెలల వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఈ వ్యతిరేకత కంటిన్యూ అయితే కష్టాలు…
నీళ్లు, నిధులపేరుతో కేసీఆర్ కోట్ల అవినీతికి పాల్పడ్డారని, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఇంకా చాలా శిక్షణా తరగ తులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోనియా గాం ధీ ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏఐసీసీ ఫ్లీనరీ సమావేశాలను హైదరాబా ద్లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్,బండి సంజ య్ల ప్రెస్మీట్లు చిక్కడపల్లి కౌంపౌండ్‌ను…
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి తర్వాత మరోటి అన్నట్టు కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి.. నవజ్యోత్ సింగ్, సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య వివాదాలతో.. చివరకు అమరీందర్ పార్టీని కూడా వీడి వెళ్లిపోగా.. కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కొత్త సీఎం చరణ్‌జిత్ చన్నీతో కూడా సిద్ధూకు పొసగని పరిస్థితి వచ్చింది.. అయితే, ఈ పరిణామంలో మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నారు ఈ మాజీ క్రికెటర్.. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ దిగివచ్చారు..…