రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతు బీరయ్య మృతి చెందాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు చేయ లేదన్న బాధతోనే రైతు మృతి చెందాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో కలెక్టర్ల నివేదికలకు విలువ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన ప్రభు త్వం అది వదిలేసి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇస్తుందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి…
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ పంట కొనుగోళ్లలో, రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్ధతు ధర లభించడం లేదని, ప్రభుత్వ తీరు మారకుంటే కాంగ్రెస్ రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గ్రూపులు, అంతర్గత కలహాలు, కుమ్ములాట ఇలా ఏవీ కొత్త కాదు.. సందర్భాలను బట్టి అంతర్గత విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి.. తాజాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.. కొత్త కమిటీలు వివాదానికి దారితీస్తున్నాయి… ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో మండల కమిటీల మార్పిడితో పాత క్యాడర్లో ఆందోళన మొదలైంది.. ఈ పరిణామంపై పాత క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఇదంతా మహేశ్వర్ రెడ్డి వర్గం పనే అంటున్న మండిపడుతోంది ప్రేమ్ సాగర్…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిన విషయం విధితమే. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెడుతామని ప్రకటన కూడా చేశారు. అనంతరం జరిగిన హుజురబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది దక్కించుకోలేకపోయారు పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్రెడ్డి, మరోవైపు.. ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టేస్తుంటారు.. ఇక, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. టి.పీసీసీ.. కోమటిరెడ్డి మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో తాను మాట్లాడుతా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత,…
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేడు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఎసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మనసులో ఉన్న ఆవేదన అంతా మీటింగ్ లో చెప్పానని, పార్టీకి సంబంధించిన అనేక అనుమానాలు పీఎసీలో లేవనెత్తనట్లు తెలిపారు. అంతేకాకుండా ‘బయట ఎంత తీవ్రంగా మాట్లాడా,నో…
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని కాంగ్రెస్ నేతల్లో అసహనం వ్యక్తమయింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికపై పూర్తి బాధ్యత నాదేనని స్పందించారు. ఇదిలా ఉంటే నేడు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఎసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ పార్టీలో క్రమశిక్షణ లోపం…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ పార్టీ కంటే… కాంగ్రెస్ పార్టీ లోనే ఎక్కువగా కుంపటి పుట్టిస్తోంది. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవానికి కారణం రేవంత్ రెడ్డినే చేస్తున్నారు సీనియర్లు. ఇక తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి… కూడా హుజురాబాద్ ఫలితంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో… గెలుపు.. ఓటములు సహజమని…. కోమటి రెడ్డి వ్యాఖ్యలు సరైనవే…కానీ బయట మాట్లాడకుండా ఉండాలన్నారు. పార్టీ వ్యవహారాలు పార్టీ…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున వెలువడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో అందరికంటే భారీగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 3012 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకొవచ్చు. 2018 లో జరిగిన…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలతాల్లో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది.ఆది నుంచి కూడా ఏ రౌండ్లోనూ ఆధిపత్యం సాధించలేకపోయింది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ఫలతితాలకు తనదే బాధ్యత అని ఆయన చెప్పారు. ఒక ఉప ఎన్నికతో పార్టీనీ నిర్దేశించలేదన్నారు. ఆలస్యంగా అభ్యర్థిని నిలబెట్టినా… ఊరుఊరు వెంకట్ తిరిగాడన్నారు. భవిష్యత్‌లో పార్టీకి బలమైన నాయకుడు అవుతారన్నారు. రేపటి నుండే నియోజక వర్గంలో ఉంటారు. కష్టపడి పని చేసే ఓపిక.. సహనం నాకు ఉందని…