Global Cricket Leagues: ప్రపంచ క్రికెట్‌లో కొత్త ట్రెండ్.. ఇక పాక్ ఆటగాళ్లకు బీపీఎల్ ఒక్కటే దిక్కు!
- ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో భారతీయ వ్యాపారవేత్తల ప్రభావం
- సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 6 జట్లకు భారత యజమానులే
- ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో కూడా ఆరు ఫ్రాంచైజీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో భారతీయ వ్యాపారవేత్తల ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు జట్లకు భారత యజమానులే ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో కూడా ఆరు ఫ్రాంచైజీలు భారతీయుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ క్రికెట్ వ్యాపారంలో ఇండియన్ పెట్టుబడిదారుల ప్రభావాన్ని స్పష్టంగా చూపుతున్నాయి.
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో నాలుగు జట్లు, అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్‌లో కూడా నాలుగు జట్లు భారత యజమానులతో సంబంధం కలిగి ఉన్నాయి. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడు ఫ్రాంచైజీలకు భారత వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టారు. ఆస్ట్రేలియాలోని బీబీఎల్ ఫ్రాంచైజీల విక్రయంపై భవిష్యత్‌లో చర్చలు జరగవచ్చని, వచ్చే ఏడాది నాటికి అక్కడ కూడా భారత పెట్టుబడిదారులు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే న్యూజీలాండ్‌లో ప్రారంభం కానున్న కొత్త లీగ్‌లో కూడా భారత పెట్టుబడుల దారుల ప్రభావం ఉండొచ్చని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
Also Read: Sikandar Raza: ఏదైనా జరగొచ్చు, 3 మ్యాచ్‌లలో 2 గెలిస్తే.. సూపర్-8కు ముందు సికందర్ రజా హెచ్చరిక!
ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్థాన్ ఆటగాళ్లు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) వంటి కొన్ని లీగ్‌ల్లోనే కనిపించే పరిస్థితి వస్తుందా? అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ప్రపంచ ఫ్రాంచైజీ క్రికెట్‌లో భారత్ వ్యాపారవేత్తల పెట్టుబడులు పెరుగుతుండటం వల్ల గ్లోబల్ క్రికెట్ ఆర్థిక నిర్మాణంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!