తెలంగాణలో విద్యార్థులు ..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ విధానాలవల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో జైల్ భరో చేద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపు నిచ్చారు.
Read Also: వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్న షర్మిల
మోడీ..కేసీఆర్ లాంటి నాయకులు దేశాన్ని పట్టి పీడుస్తున్నారని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల విధానం మీద అనుమానం వచ్చేలా ప్రధాని కార్యాలయం వ్యవహరిస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తొక్కి చంపిన మంత్రిని మోడీ క్యాబినెట్‌లో ఇంకా కొనసాగించడం అంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. రైతులను తొక్కి చంపండి అని ప్రొత్సహించడమేనా అనిరేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని రేవంత్ రెడ్డి అన్నారు.