కాంగ్రెస్‌కు కీలక నేత షాక్.. బీజేపీ గూటికి కేంద్ర మాజీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి.. ఆదిలోనే అధికార బీజేపీ పార్టీని దెబ్బ కొడుతూ.. ముగ్గురు మంత్రులను, 10 మందికి పైగా ఎమ్మెల్యేలను సమాజ్‌వాదీ పార్టీలో చేర్చుకున్నారు అఖిలేష్ యాదవ్.. ఆ తర్వాత ములయాంసింగ్ ఫ్యామిలీని టార్గెట్ చేసి.. ఆ కుటుంబంలోని ఇద్దరికి బీజేపీ కండువా కప్పారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తూనే ఉంది బీజేపీ.. ఇప్పటికే పలువురు కీలక నేతలకు కండువా కప్పారు.. ఇక, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న ఆర్‌పీఎన్ సింగ్.. ఇప్పుడు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది యూపీ రాజకీయాలతో పాటు, కేంద్ర రాజకీయాల్లో కూడా పెద్ద చర్చగా మారింది.
యూపీ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఆర్‌పీఎన్ సింగ్‌కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యతే ఇచ్చింది పార్టీ.. పడ్రానా నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయనను.. యూపీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ లిస్టులోనూ స్థానం కల్పించింది పార్టీ.. అంతేకాదు.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారాయన.. కానీ, ఉన్నట్టుండి ఇవాళ ఉదయం సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి చర్చకు తెరలేపారు.. ప్రస్తుతం మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. నా రాజకీయ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు ఆర్‌పీఎన్ సింగ్.. ఇక, ఇవాళ మధ్యాహ్నం డిప్యూటి సీఎం కేశవ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ ఇన్చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.. ఇక, ఈ కార్యక్రమంలో బీజేపీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. ఆర్‌పీఎన్ సింగ్.. కాంగ్రెస్ పార్టీని వీడడానికి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.. ఆయన అనుచరులకు కాంగ్రెస్ టికెట్లు నిరాకరించిందని కొందరు.. బీజేపీ నుంచి మంచి ఆఫర్ అందుకున్నాడని ఇంకా కొందరు చేస్తున్న కామెంట్లు.
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!