BJP: కర్ణాటక బిజెపి ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. కలబురిగిలో జరిగిన ఒక సభలో రవి కుమార్ మాట్లాడుతూ.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణ స్వామి పట్ల వ్యవహరించిన తీరుపై ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ మద్దతుదారులు ప్రభుత్వ అతిథి గృహాన్ని ముట్టడించిన సమయంలో ఆయన లోపల ఉన్నారు.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా వాణిలో చిన్నారులు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలని అధికారులకు విన్న విన్నవించారు. ఇన్ని రోజుల పాటు కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని పోలీసులు, అధికారులు కాపాడారని తెలిపారు.
మన పార్టీ నుంచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పండబెట్టి తొక్కే విదంగా ఓడించాలి.. మీ ఆవేశం చూస్తుంటే రాబోయే గద్వాల ఉప ఎన్నికల్లో మనం సామాన్య వ్యక్తిని పెట్టినా గెలుస్తాం అన్నారు.. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు చూడాలి ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని అని అందరూ అడుగుతున్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
త్వరలోనే రాహుల్ గాంధీకి ధన్యవాద సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం ప్రకటించాడు.. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని అప్పుడే వెల్లడించారు.. అందులో భాగంగానే.. దేశంలోనే మొట్ట మొదట తెలంగాణలో కులగణన చేశామని వి. హన్మంతరావు తెలిపారు.
కృష్ణా జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కేఆర్ఎంబీ చెప్తుంది.. ఈడీ చార్జ్ షీట్ లో తన పేరు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని వద్దకు వెళ్లారు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు.
Deputy CM Bhatti: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టకుండా ఎలా ఇస్తున్నారు.. ఉన్నవన్నీ కాంగ్రెస్ పార్టీ హయంలోనివే అని చెప్పాను.. భద్రాద్రి, యాదాద్రి నుంచి కరెంటు ఉత్పత్తి కాలేదని చెప్తే కేసీఆర్ నుంచి సమాధానం లేదు.. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు సాగుతున్నాం.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు ఉందన్నారు. కానీ దాన్ని అధిగమించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమ సత్తాను చాటారు.. ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరూపించారు.. గత ఆరు నెలల్లో సకాలంలో విధులకు హాజరై తమ అంకిత భావాన్ని ప్రదర్శించారని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వల్లనే “కులగణన” సాకారం కాబోతుంది.. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపడం, తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యాం అని ఆయన పేర్కొన్నారు. రాహల్ గాంధీ డిమాండ్, ఒత్తిడి వల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా “కుల గణన” కు నిర్ణయం తీసుకుంది.
KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు కార్యాలయంలో పెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘాటు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. కొందరికి గాయాలు కూడా అయ్యాయి.…
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు BRS లో నెలకొన్న కుటుంబ తగాదాలు కొత్త దిశగా మలుపుతీస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన చర్చనీయాంశంగా మారాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యానిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ముందంజలో ఉందని, BRS రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. అయితే, BRS లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కుటుంబ అంతర్గత విభేదాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని…