తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ భేటీకి సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశానికి తాను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా రాలేకపోతున్నానని, అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజువారి పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది.. అయితే, ఎన్నికలు ముగియడం.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. మళ్లీ క్రమంగా పైకి కదులుతూ సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయి పెట్రో ధరలు.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. పెట్రో ధరల పెంపుపై తీవ్రంగా మండిపడ్డ ఆయన.. పెట్రో ధరల పెంపు అనేది ప్రధాని నరేంద్ర…
ఇటీవల 40 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఒక్కొక్కరికి రెండులక్షల బీమా చేయించనున్నారు. మొత్తం 40లక్షల మందికి ఆరున్నర కోట్ల రూపాయల ప్రీమియం చెక్కును రాహుల్ గాంధీ చేతుల మీదుగా బీమా సంస్థలకు రేవంత్ రెడ్డి బృందం అందజేయనుంది. అయితే ఈ నెలతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగియనుంది. తెలంగాణలోని 32 వేల…
ఆ MLCని పాత గాయం వెంటాడుతూనే ఉంది. ఇంకా కోలుకో లేదు. పార్టీలో అన్నింటికీ ముందుండే పెద్దాయన ఇప్పుడు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తన పనెంటో తాను చూసుకుని వెళ్లిపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన ఎందుకు అలిగారు? కాంగ్రెస్ కార్యక్రమాలకు టచ్ మీ నాట్గా జీవన్రెడ్డితెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి. పార్టీకి విధేయుడు. ప్రస్తుతం ఎమ్మెల్సీ. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై పోటీ చేయడానికి పార్టీ నుంచి ఎవరూ ముందుకురాని సమయంలో మంత్రి…
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. రైతులకు భరోసా ఇచ్చే మాట చెప్పారు రాహుల్ గాంధీ అని, తలకాయ ఉన్న ఎవరికైనా తప్పు అనిపించదన్నారు. కానీ కన్నుమిన్ను ఆనకుండా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితం లేకుండా కవిత ట్వీట్ చేశారని, మీరు వేసే చిల్లర రాజకీయంలో మేము భాగస్వామ్యం కావాలా..? అని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిజాయితీనీ అడుగుతున్నారని,…
దేశంలో ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ విముఖత ఉన్నట్లు, యోగి సర్కార్ పై అక్కడి ప్రజలకు నమ్మకం పోయినట్లు ప్రత్యర్థి పార్టీలు ఎన్ని సంకేతాలు ప్రజల్లోకి పంపినా మళ్లీ అక్కడ అధికారంలో బీజేపీనే వచ్చింది. 5 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాథులు చేసిన ప్రచారం మామూలుగా లేదు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా…
అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వెనుకేసిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఒక్కరేంటి.. చిన్ననుంచి పెద్ద వరకు ఎంతో మందిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. అయితే, కొందరు మాత్రం అడ్డంగా బుక్కైన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఎప్పుడో చేసిన తప్పులు.. ఏళ్ల తరబడి వెంటాడి నేతలు కూడా ఉన్నారు.. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక…
ఆ మాజీ ఎంపీ ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీలో నెలకొన్న విభేదాలతో టచ్ మీ నాట్గా ఉంటున్నారా.. లేక జంప్ చేయడానికి చూస్తున్నారా? ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ? ఆయన చుట్టూ పార్టీలో ఎందుకు చర్చ? లెట్స్ వాచ్..! కాంగ్రెస్లో చప్పుడు లేని పొన్నంతెలంగాణ కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొంతకాలంగా సైలెంట్. హైకమాండ్ పిలుపిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో తప్ప ఎక్కడా కనిపించడ లేదు. గతంలో పార్టీ తరఫున చేపట్టిన నిరసనల్లో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులతో బేజారైపోతున్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేసేందుకు ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీ సిద్దమయ్యారు. ఢిల్లీలో కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అటెండ్ అవుతారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చిస్తారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై నేతల నుంచి వివరాలను తీసుకోనున్నారు సోనియా. పార్టీలో…
ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇదే సమయంలో.. ప్రక్షాళన ప్రారంభించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ… ఈ పరిణమాలపై ఢిల్లీలో స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. సోనియా గాంధీ ప్రక్షాళన ప్రారంభించారు.. ఆమెకు నా అభినందనలు.. ఇది శుభసూచకం అన్నారు.. రేపు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సోనియా సమావేశం అవుతున్నారు… తెలంగాణలోని పరిణామాలను కూడా సోనియా గాంధీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన…