ప్రధాన మంత్రి మోదీ పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీకి, మోదీకి ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదని.. బుర్ర అప్లై చేయడం లేదని విమర్శించారు. అన్నింటిని గందరగోళం చేసి తప్పుదోవ పట్టించడం బీజేపీ నేతలకు అలవాటని ఆయన ఎద్దేవా చేశారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్మీ ఎవరు ఏం చేస్తారో, ఎలాంటి విధులు నిర్వహిస్తారో బీజేపీ నేతలకు తెలియదని ఆయన అన్నారు. ఇతర దేశాలు దాడులు చేస్తే అప్పుడు జవాన్లను వాడుతారని.. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు రంగంలోకి దిగుతారని రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగేళ్లు ఆయుధాలు వాడటం ఎలాా అని నేర్పి బయటకు పంపితే ఏం చేస్తారని అగ్నిపథ్ పథకంపై కేంద్రాన్ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అగ్నిపథ్ ను మోదీ ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.
అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. కిషన్ రెడ్డి బట్టలు ఉతకడానికి అని.. మరో బీజేపీ నేత బీజేపీ కార్యాలయాల ముందు సెక్యురిటీ గార్డ్ ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారని.. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాల్పులు జరిగిప ఓ యువకుడి మరణానికి కారణం అయిందని.. మళ్లీ అంతిమ యాత్ర కూడా నిర్వహించిందని విమర్శించారు. యువకులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని.. టీఆర్ఎస్ పరోక్షంగా అగ్నిపథ్ కు మద్దతు ఇస్తుందని.. సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.