Kuldeep Bishnoi Joins BJP: కాంగ్రెస్ పార్టీకి వరసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. బుధవారం యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది ఈడీ. ఇదిలా ఉంటే వరసగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కీలక నేేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీ పాార్టీలో చేరబోతున్నారు.
Shabbir Ali comments on Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయం అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ వీడిన రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కోమటిరెడ్డి వ్యవహారంలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నాయకులు ఒకరికి ఒకరు వార్నింగులు ఇచ్చుకుంటున్నారు.
National herald case - ED seals Young Indian's office: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ లోని నేషనల్ హెరాల్డ్ ఆఫీసులో ఉన్న యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) సీజ్ చేసింది. ఈ ఘటన గాంధీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. హెరాల్డ్ హౌజ్ భవనానికి సంబంధించిన ఆర్డర్లను కూడా ఈడీ అతికింది.
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో… ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కేసులో మంగళవారం నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది. హస్తినలోని కేంద్ర కార్యాలయంతో పాటు 12 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దాడులు పూర్తయిన తర్వాత… ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. గల నెలలో మూడు రోజులు పాటు ఈడీ… సోనియా గాంధీని 12 గంటల పాటు ప్రశ్నించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ… విచారణ పేరుతో ఈడీ కార్యాలయానికి రప్పించింది. అంతకు ముందు సోనియా…