Congress interim president Sonia Gandhi tests positive for COVID19: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో చికిత్స తీసుకున్నారు సోనియాగాంధీ. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు జూన్ మొదటివారంలో కరోనా బారిన పడ్డారు సోనియా గాంధీ.
కేంద్రంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్లోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్… ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు చింతా మోహన్.. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చింతామోహన్ మాట్లాడుతూ.. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనని గుర్తుచేశారు.. నేడు దళితులు దేవాలయాలకు, విద్యాలయాలకు వెళ్తున్నారంటే కారణం కాంగ్రెస్…
టీటీడీపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి… తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. పాదయాత్రలో పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రులు టి. సుబ్బరామిరెడ్డి, చింతా మోహన్.. అంబేద్కర్ భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ పరిపాలను ప్రస్తుతం చాలా బాగుంది.. టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఎంత మంచి పాలన…
నన్ను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. ఇక్కడే చస్తా అని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఉపఎన్నిక కసరత్తు మీటింగ్కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. ఏ మీటింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్కు నేను ఎందుకు వెళ్తా? అని ప్రశ్నించారు. ఇక, చండూరులో సభలో నన్ను అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు.…
మునుగోడు ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీచేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు విజయం మాదేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు తనకు ఆహ్వానం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దూరంగా ఉండడంపై పెద్ద చర్చే జరిగింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికలపై రేవంత్రెడ్డి అప్పుడే చేతులు ఎత్తేశారని…