Revanth Reddy: 1980 లో పుట్టిన బీజేపీ అయినా… 2001 లో పుట్టిన టీఆర్ఎస్ అయినా మమ్మల్ని పొగిడి తీరాల్సిందే.. చరిత్ర ఉన్నది మాకే అన్నారు రేవంత్ రెడ్డి. ట్విట్టర్ టిల్లు పొగిడింది కూడా అందుకే అని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారిక వేడుక కాదు.. కేవలం టూరిజం శాఖ మాత్రమే చేస్తుందని అన్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి ఇదో ప్రయత్నం అని రేవంత్ విమర్శించారు.…
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన అంశాలను తెర మీదకు తెచ్చారు రేవంత్ రెడ్డి… తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్రానికి కొత్తగా జెండా ఏర్పాటు అంశాలపై కార్యాచరణ రూపొందించారు. దీనిపై జానారెడ్డి నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్, దామోదర రాజనర్సింహ.. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి.. మధు యాష్కీ మీటింగ్‌కు హాజరయ్యారు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల భేటీలో సెప్టెంబర్ 17, కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చించారు. ఇప్పుడు…
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రలో రాహుల్‌గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు.
గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. 'భారత్ తోడో యాత్ర' అని రాహుల్ గాంధీ తన ప్రయాణంలో భారతదేశ వ్యతిరేక వ్యక్తులతో సమావేశమవుతున్నారని ఆరోపించారు.
MLC Jeevan Reddy: భద్రాచలం పక్కన ఉన్న 7 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదని అన్నారు. Itir ప్రాజెక్టు కనుమరుగైందని విమర్శించారు. గిరిజన సమాజం తెలంగాణ వచ్చినప్పటి నుంచి అత్యధికంగా నష్టపోతుందని అన్నారు. కేంద్రం గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు కల్పిస్తుంటే రాష్ట్రం మాత్రం 6% రిజర్వేషన్లు కల్పిస్తోందని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సక్రమంగా జరగడం లేదని అన్నారు. ఉద్యమ నాయకుడే…
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేంద్రంగా… కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ… స్వామి వివేకానంద విగ్రహాన్ని సందర్శించకుండా అగౌరవపర్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. భారత్‌ను ఏకం చేసేందుకు కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్.. స్వామి వివేకానందుడిని మర్చిపోవడం సిగ్గుగా అన్పించట్లేదా ? అంటూ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, స్మృతి ఇరానీ వ్యాఖ్యలను…