Rahul Gandhi blamed AAP for Congress' defeat in Gujarat elections: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి తొలిసారి స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కారణం అని నిందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, బీజేపీ పార్టీకి బీ-టీమ్ గా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
దేశ సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి వచ్చే ముప్పును ప్రభుత్వం తక్కువ మాత్రమే చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దానిని అంగీకరించడం లేదన్నారు.
తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు…
Why Do You Say Jai Sree Ram, Not Jai Siyaram ? Rahul Gandhi To RSS, BJP: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహిళలను అణచివేస్తోందని అన్నారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’లో ఆర్ఎస్ఎస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రణాళిక అని బుధవారం అన్నారు. భయం, ద్వేషానికి వ్యతిరేకంగా నిలిచేందుకే భారత్ జోడో యాత్ర…
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేస్తోంది. సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు.
ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నాయకులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు సిద్దమయ్యారు.
Raghuram Rajan Joins Rahul Gandhi During Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో ఐక్యత పెంపొందించే లక్ష్యంతో, పార్టీకి పూర్వవైభవాన్ని తేవాలని ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. రాహుల్ గాంధీ గత మూడు నెలల నుంచి పలు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు పలువురు సెలబ్రెటీలు, బాలీవుడ్ నటులు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు.