కర్ణాటకలో వచ్చే ఏప్రిల్/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది.
లేటు వయస్సులోనూ కొందరు నేతలు చక్రం తిప్పుతున్నారు.. పదవుల కోసం పాకులాడుతున్నారు.. పంచాయితీలు కూడా పెడుతున్నారు.. మరికొందరు పార్టీలు మారి.. కొత్త పార్టీలో ఇమడలేకపోతున్నారు.. ఇప్పుడు జరిగిన ఓ పరిణామం చూస్తుంటే.. అదే నిజమా? అనే అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు గుడ్బై చెప్పేశారు.. దానికి ప్రధాన కారణం తన ఏజ్గా చెప్పుకొచ్చారు.. ఇక, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన ఆయన.. 90 ఏళ్ల…
Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.
Sonia Gandhi admitted to Delhi's Ganga Ram Hospital for medical checkup: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతతో ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రిలో చేరారు. సోనియాగాంధీతో ఆమె కుమార్తె పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వెంట ఉన్నారు. 76ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రొటీన్ చెకప్ కోసం వచ్చారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఇబ్బందిపడుతున్నారు. మంగళవారం నుంచి అస్వస్థతలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం యూపీలో…
Chinta Mohan: ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి కారణంగా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. చంద్రబాబు అక్కడ (తెలంగాణలో) సభ పెడితే.. కేసీఆర్ ఇక్కడ (ఆంధ్రప్రదేశ్లో) పెడుతున్నాడన్నారు. ఇక, ఎన్టీఆర్ లాగా కేసీఆర్ కు కూడా ప్రధాని కావాలనే ఆశ ఉందేమో..? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రానే రాదు అని జోస్యం చెప్పారు.. వైసీపీ పైకి ఎన్ని గొప్పలు చెప్పినా..…
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' తొమ్మిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్లో నేడు పునఃప్రారంభం కానుంది. 110 రోజులకు పైగా సాగిన యాత్రలో ఇప్పటివరకు 3వేల కిలోమీటర్లకు చేరుకుంది.