Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచకి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయి. 27 సమావేశాలు, 66 రోజుల పాటు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోెషి తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యసభ, లోక్ సభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్ , ఇతర అంశాలపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చల కోసం ఎదురుచూస్తున్నామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. అయితే ఫిబ్రవరి 14 మరియు మార్చి 12 మధ్య సమావేశాలకు విరామం ఉంటుంది.
2023 బడ్జెట్ సెషన్ లో సంబంధిత డిపార్ట్మెంట్లు, పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీలు గ్రాంట్ల కోసం డిమాండ్లను పరిశీలించడానికి, మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నివేదికలను రూపొందించడానికి వీలుగా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు విరామం ఉంటుందని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ప్రజలకు ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూడాలి. మరోవైపు ద్రవ్యోల్భనం, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం వంటి అంశాలను హైలెట్ చేసేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.