వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ చార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం సంకెపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెనుకబడిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వైఫల్యాలపై చార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. 500 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మోసం చేశారని, ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న హామీ గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు. వేములవాడలో తాగునీటికి కటకట ఉన్నా.. సమస్యను తీర్చడం లేదని, తిప్పాపూర్ బస్టాండ్ ను కూల్చి కావాలనే వేరేచోట నిర్మించాలని చూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో బాలికలకు జూనియర్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజ్ లేదని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Oxygen Plant Blast : ‘బంగ్లా’లోని ఆక్సీజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. మృతులను లెక్కిస్తున్న రెస్క్యూ
కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, 2018లో దసరాకు రైతులకు నీళ్లు ఇస్తామన్న హరీష్ హామీ.. అయిదు దసరాలు గడిచినా నెరవేరలేదన్నారు. అటవీ అనుమతులు లేక రోడ్డు పనులు నిలిచిపోయినా పట్టించుకోవడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదని, నాంపల్లి పల్ల గుట్ట ప్రాంతంలో పేదలకు కాంగ్రెస్ పంచిన భూములను ధరణి పేరుతో ప్రభుత్వం గుంజుకుందన్నారు. 10నెలల్లో ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే పరిష్కరిస్తామని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
Also Read : Harish Rao : కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం