Revanth Reddy : ఇది హ్యాకింగా, హానీ ట్రాపా, లీకా తేల్చాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నిజామాబాద్‌లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మోపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీపీసీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వెనుక ఏం జరిగింది? అసలు కారణాలు ఏంటో అధికారులు కానీ, సీఎం కానీ వివరణ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారన్నారు. వివిధ పార్టీల నుండి ఫిరాయించిన వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌లుగా చేశారన్నారు. ఇది రాజకేయ పునరావాస కేంద్రంగా మారిందని ఆయన మండిపడ్డారు. గ్రూప్1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వస్తున్నాయని, ప్రశ్నాపత్రాలు సేఫ్ కస్టడీలో ఉండాలన్నారు. కమిషన్ చైర్మన్, సెక్రెటరీ ల పరిధిలో మాత్రమే ఉండే ప్రశ్నపత్రాలు ఇతరుల చేతికి ఎలా వెళ్లాయని ఆయన అన్నారు. కంప్యూటర్ పాస్ వర్డ్, కోడ్ ప్రవీణ్ అనే వ్యక్తి వద్దకు ఎలా వచ్చాయని, ఇది హ్యాకింగా, హానీ ట్రాపా, లీకా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గత 9 ఏళ్లలో ఏ పోటీ పరీక్షలు కానీ తప్పులు లేకుండా నిర్వహించలేక పోయారన్నారు.
Also Read : Pawan Kalyan: వారాహి ఆపి అంబులెన్స్ కు దారి ఇచ్చిన జనసేనాని
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ఇందులో ప్రభుత్వ పెద్దలున్నారు.. గూడపుఠానీ నడుస్తోందన్నారు. అందుకే ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఫిర్యాదు చేయలేదని, గతంలో అనేక పరీక్షల్లో టీఆర్‌ఎస్ నాయకుల ప్రమేయాలు బయట పడ్డాయన్నారు. వాస్తవానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 400 మంది ఉద్యోగులు ఉండాలి, కానీ ఇప్పుడు 80 మంది మాత్రమే ఉన్నారు, ఇందులో ఆఫీస్ లో పని చేసేది 30 మాత్రమేనని ఆయన అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక జరిగిన అన్ని పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలన్నారు. కేసీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులపై కానీ మచ్చ రాకుండా విచారణకు సిద్ధం కావాలన్నారు. మీ కుటుంబ సభ్యులకు ఒక్క రోజు కూడా ఉద్యోగం లేకుండా ఉండలేరన్నారు. కానీ 2 లక్షల మంది ఉద్యోగాలపై మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Also Read : Venugopala Krishna: కేబినెట్లో మార్పులు మీడియా ఊహ మాత్రమే
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!