Bhatti vikramarka: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. రెండవ రోజు ఇచ్చోడ నైట్ హాల్ట్ పాయింట్ నుంచి పీపుల్స్ మార్చ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి రోజు పిప్పిరి నుంచి ఇచ్చోడ వరకు యాత్ర కొనసాగింది. నేడు సిరికొండలో సాయంత్రం కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడనున్నారు.
Read also: BJP: రాహుల్ లండన్ ప్రసంగంపై దుమారం.. క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్
నిన్న కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.. 90 రోజుల్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు భట్టి విక్రమార్క. ఆయన 1,365 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్ననారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి తర్వాత నియోజకవర్గాల సంఖ్య పరంగా ఇది రెండవ అతిపెద్ద పాదయాత్ర. ఈ పాదయాత్ర దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. ముఖ్య అతిధులుగా పాల్గొనేందుకు రాజస్థాన్‌తో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నాలుగైదు పెద్ద బహిరంగ సభలు నిర్వహించనున్నారు. దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించి జూన్ 15న ఖమ్మం జిల్లాలో యాత్రను ముగించనున్నారు. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’లో భాగంగా పాదయాత్ర చేపట్టాలని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఏఐసీసీ నాయకత్వం భట్టిని కోరిందని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తెలిపారు. అయితే.. ఇది వ్యక్తిగతంగా చేస్తున్న యాత్ర కాదని, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ చేపట్టే యాత్రేనని ఇదివరకే భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వివిధ సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కోట్లు ఖర్చు చేసినా వాటి ఫలాలు ప్రజలకు అందకపోవడం బాధాకరమని అన్నారు భట్టి విక్రమార్క.
ఇది ఇలా ఉండగా.. మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించిన నాలుగు రోజులకే ముగించారు. తన పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేయాలని ఆదేశించడంపై మాణిక్ రావు థాక్రేపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఠాక్రేకు లేఖ కూడా రాసిన థాక్రే స్పందించలేదు. మొదటగా మల్లుభట్టి విక్రమార్క, మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా పాదయాత్ర చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కానీ మహేశ్వర్ రెడ్డి ఒక్కరే పాదయాత్రను ప్రారంభించారు. అయితే యాత్ర ప్రారంభించిన నాలుగు రోజులకే మహేశ్వర్ రెడ్డి యాత్రను ముగించాల్సి వచ్చింది.
Revanth reddy: 31వ రోజుకు చేరిన రేవంత్ పాదయాత్ర.. ఆర్మూర్‌లో జనసభ