PM Modi: ఈసారి సేవ చేసే అవకాశం బీజేపీకి ఇవ్వండి.. బెంగాలీయులకు మోడీ పిలుపు
- ఈసారి సేవ చేసే అవకాశం బీజేపీకి ఇవ్వండి
- బెంగాలీయులకు మోడీ పిలుపు
- ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈసారి బీజేపీ ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రజలను ప్రధాని మోడీ కోరారు. ఈ మేరకు బెంగాలీయులను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ హిందీ, బెంగాల్ భాషల్లో లేఖలు రాశారు. లేఖ ప్రారంభంలో కాళీమాతను స్తుతిస్తూ రాశారు.
త్వరలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ లేఖ రాయడం కీలకంగా మారింది. రాబోయే నెలల్లో రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే అధికారం ప్రజలదేనని లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి, సంపన్నమైన రాష్ట్రంగా మార్చేందుకు ఇదొక అవకాశం అని.. ఈ అభివృద్ధి ప్రయాణంలో బెంగాలీయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
బెంగాల్ భూమి దేశానికి అనేక మంది గొప్ప వ్యక్తులను అందించిందని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్‌లను ఉదహరించారు. బెంగాల్‌కు కీర్తిని తెచ్చిన గొప్ప వ్యక్తులను, దానికి కొత్త దిశానిర్దేశం చేయవలసిన అవసరాన్ని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దార్శనికతను కూడా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. అనేక కేంద్ర పథకాల ప్రయోజనాలు పశ్చిమ బెంగాల్‌లోని లక్షలాది మందికి చేరాయని పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలు, పేదల కోసం ప్రారంభించిన పథకాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. గత 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మోడీ గుర్తుచేశారు.
ఇటీవల కాలంలో రాష్ట్రం వెనుకబడి ఉందని లేఖలో రాశారు. రాజకీయ హింస, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. యువత వలసలు, పెట్టుబడుల కొరత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని మోడీ కోరారు.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..