Bajrang Dal: భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ హామీ.. ప్రధాని మోడీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajrang Dal: కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో వస్తే హిందూ సంస్థ ‘భజరంగ్ దళ్’ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ప్రకటించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఈ హామీపై బీజేపీతొో పాటు పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఇండియా(పీఎఫ్ఐ)తో భజరంగ్ దళ్ ను పోలుస్తూ కాంగ్రెస్ ఈ హామీ ఇవ్వడంపై భజరంగ్ దళ్ మాతృసంస్థ విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎన్నికల వాగ్ధానాన్ని సవాల్ గా తీసుకుంటామని విహెచ్‌పి జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ ఓ వీడియో సందేశంలో తెలిపారు.
Read Also: Morgan Stanley Layoff: మోర్గాన్ స్టాన్లీలో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్
Also Read
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ప్రపంచం మొత్తానికి పీఎఫ్ఐ కార్యకలాపాల గురించి తెలుసని, దేశానికి, సమాజానికి సేవ చేయడానికి అంకితభావంతో ఉన్న భజరంగ్ దళ్ తో పోల్చడం మంచిది కానది సురేంద్ర జైన్ అన్నారు. కాంగ్రెస్ భజరంగ్ దళ్ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్న తీరును దేశ ప్రజలు అంగీకరించాని అన్నారు. మేము రాజకీయాల్లోకి రామని, కానీ కాంగ్రెస్ మమ్మల్ని రాజకీయాల్లోకి లాగాలనుకుంటోందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ‘సిమి’ ఉగ్రవాద సంస్థపై నిషేధాన్ని వ్యతిరేకించారని భజరంగ్ దళ్ గుర్తు చేసింది. ఈ హమీలో కాంగ్రెస్ రహస్య ఎజెండా ఉందని విహెచ్‌పి నేతలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ మానిఫెస్టోలో ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ‘రాముడి’తో సమస్య ఉందని, ప్రస్తుతం ఎవరైతే జై భజరంగబలి అని నినాదలు చేస్తారో వారిని కూడా నిరోధించాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. హోస్పేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. నేను హనుమంతుడి భూమిని గౌరవించాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం భజరంగ్ బలికి తాళం వేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ‘‘హనుమంతుని పాదాలకు నా శిరస్సు వంచి ఈ ప్రతిజ్ఞ నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. కర్ణాటక గౌరవం మరియు సంస్కృతిని ఎవరూ దెబ్బతీయనివ్వవుము’’ అని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?