Off The Record: సంజయ్ సైలెంట్ గా వెళుతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆ సీనియర్ నేత కుమారుడు తన మౌనంతో ప్రత్యర్థులను టెన్షన్ పెడుతున్నారా? దాని వెనక నిజంగానే ఏదైనా భారీ ప్లాన్ ఉందా? లేక ప్రత్యర్థుల్లో ఆందోళన రేపడానికి ఉత్తుత్తి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? జిల్లాకు చెందిన ముఖ్య నేతలే మేం నిన్ను గుర్తించడం లేదు ఫో.. అంటుంటే…ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉండి ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్.
సంజయ్ సైలెంట్‌గా తెరవెనక మంత్రాంగం నడుపుతున్నారా?
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్…. కొద్ది రోజుల క్రితం ఘర్ వాపసీలో భాగంగా.. తన తండ్రి డీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన్ని పార్టీలోకి తిరిగి రానీయకుండా జిల్లా నేతలు చాలా కాలం అడ్డుకున్నా..చివరికి ఆపలేకపోయారట. కుమారుడితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీఎస్.. ఆ తర్వాత మాట మార్చడంతో అసలా చేరికే గందరగోళంలో పడింది.దీంతో కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు సంజయ్. పార్టీ కార్యక్రమాలకు హాజరవడం లేదు. ఆయన చేరికను తాము గుర్తించడం లేదన్నట్లు జిల్లా నేతలు సైతం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడం లేదట. దీంతో సంజయ్.. తన ఇంటినే పార్టీ లోకల్ ఆఫీస్‌గా చేసుకుని.. చేరికలను ప్రోత్సహిస్తున్నారట. అయితే.. తమ అనుమతి లేకుండా జరిగే ఆ చేరికలు కూడా చెల్లవంటూ క్లారిటీ ఇచ్చేశారు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ నేతలు. ఎవరు ఏం అనుకున్నా.. నా దారి నాదేనంటూ తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారట సంజయ్. అర్బన్ కాంగ్రెస్ లో యాక్టివ్ రోల్ పోషించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారట.
Also Read
నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ టిక్కెట్ కోసం నలుగురు పోటీ
నిజామాబాద్ అర్బన్ సీటు పై కన్నేసిన సంజయ్.. ఆ వ్యూహంలో భాగంగానే హస్తం గూటికి చేరి చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారన్నది లోకల్ టాక్. ఈ పాటికే అర్బన్ సీటు పై కన్నేసిన .. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అర్బన్ నా అడ్డా అంటున్నారట. ఈ సీటును వదులుకునే ప్రసక్తేలేదని తన అనుచరుల దగ్గర చెబుతున్నారట. గత ఎన్నికల్లో అర్బన్ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో ఉన్న సీనియర్ నేత తాహేర్ బిన్ హందాన్, అర్బన్ పార్టీ అధ్యక్షుడు కేశ వేణు సైతం ఒక్క ఛాన్స్ అంటున్నారట. అందుకే అంతా కలిసి సంజయ్‌కి పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపకుండా , జిల్లా పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారట. మాజీ మేయర్ సైతం దూకుడుగా వ్యవహరించకుండా అవకాశం కోసం ఎదురుచూస్తూ.. అండర్ గ్రౌండ్ లో తన పని తాను చేసుకుంటూ పోతున్నారట. అయితే ఆ మౌనం వెనక ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది రాజకీయ ప్రత్యర్థి వర్గం. ఇలా నిజామాబాద్ అర్బన్ టికెట్ కోసం నాలుగు స్తంభాలాట నడుస్తుండగా… రేసులో ఎవరు ముందుంటారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!