తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ గాంధీభవన్‌లోకి ఏకంగా గొర్రెల్ని తోలుకొచ్చి ధర్నా చేశారు గొల్ల కురుమలు. గంటకు పైగా గాంధీ భవన్లో నానా హంగామా జరిగింది. గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆందోళకారులు. సమస్యలు చెప్పుకోవడం... వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయడం వరకు ఓకేగానీ.... ఇలా ఏకంగా పార్టీ ఆఫీస్‌లోకి గొర్రెల్ని తీసుకు రావడం...
Sanjay Raut: 1975,జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ‘‘అత్యవసర పరిస్థితి’’ని విధించారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది. అయితే, బీజేపీ ఎమర్జెన్సీని విమర్శిస్తూ భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ మాత్రం ఇందిరాగాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge: శశిథరూర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు. ఆయనను పార్టీలో ఉంచుకోలేక, బయటకు పంపించలేక హస్తం పార్టీ సతమతం అవుతోంది. మరోవైపు, థరూర్ ప్రధాని నరేంద్రమోడీని, మోడీ నాయకత్వాన్ని ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రపంచ దేశాలు పర్యటించిన దౌత్యబృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. ఈ సామెతను మర్చిపోకుండా ఉంటే.... మీకే మంచిదంటూ... భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి పదేపదే చెబుతున్నారట మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ హస్తం పార్టీ నేతలు. అంతేకాదు... ఏ రోటికాడ ఆ పాట పాడితే... తర్వాత మేం వేసే మ్యూజిక్ వేరేగా ఉంటుందని సీరియస్‌గా వార్నింగ్స్ సైతం ఇస్తున్నట్టు తెలిసింది. ఆ హెచ్చరికల మోత మోగిపోవడంతో... ఎంపీ సాబ్ ఏం చేయలేక చివరికి చాలామంది నాయకుల ఫోన్ నంబర్స్‌ని…
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.. ట్యాపింగ్ ఎలా చేస్తారు.. ఎప్పుడు చేశారనే విషయాలు బయటకు వస్తున్నాయి.. రివ్యూ కమిటీ కి చైర్మన్ గా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో పాటు జిఐడి పొలిటికల్ సెక్రటరీ స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు.. మూడు ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు సిట్ తేల్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి.. ఫోన్ ట్యాపింగ్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ వద్ద ఆధారలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం వెళ్లేదని గుర్తించారు. ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన 70లక్షలు సీజ్ చేసిన విషయం తెలిసిందే. డబ్బుల తరలింపు పై టాస్క్‌పోర్స్ టీమ్ కు ప్రణీత్ రావు సమాచారం…
వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమచేస్తోంది. రైతులకు డబ్బులు అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రేపు రైతు భరోసా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా?.. రూ. 15 వేలు ఇస్తానని…
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి.
Telangana Congress: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ ముదిరాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిపై స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన నేతలు, వారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నట్టరాజన్కు ఫిర్యాదు చేయాలని జిల్లాలో పలువురు నేతలు సన్నద్ధమవుతున్నట్లు…