తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే అది యూరియా కొరత మాత్రమే. గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా లభించకపోవడంతో రైతన్నలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్ లో నిల్చోని అలసిపోతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు యూరియా అందించే సమయంలో యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Boinapalli Medha School: ఇవే తగ్గించుకుంటే మంచిది.. ఒక వైపు క్లాస్ రూమ్స్.. మరో వైపు డ్రగ్స్ తయారీ..
మహిళా రైతులు కూడా రైతు వేదికల వద్ద యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం క్యూలో నిల్చన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద అధికారులు యూరియా పంపిణీ చేపట్టారు. యూరియా ఇస్తుండడంతో రైతులతో పాటు సత్యవతి రాథోడ్ కూడా క్యూలో నిల్చున్నారు. మాజీ మంత్రి యూరియా కోసం క్యూలో నిలబడడం చర్చనీయాంశంగా మారింది.