అధికారులను పంపించి ముగ్గు వేయించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు ఎలా క్యాన్సల్ చేస్తారని ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన శ్రీరాములపేటలో ఇప్పటి వరకు ఎందుకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వలేదని అడిగారు. దళిత బంధు వచ్చిన దళితులకు ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఇవ్వరు.. ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు వచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని చెప్పారా సమాధానం ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Rahul Gandhi: బీహార్లో మహిళలకు పంపిణీ చేయాలనుకుంటున్న ఉచిత ‘‘శానిటరీ ప్యాడ్స్’’పై రాహుల్ గాంధీ బొమ్మ ఉండటంపై కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడింది. మహిళల కోసం ఇచ్చే ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ముఖం ఎందుకు ఉందని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మహిళలకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో కాంగ్రెస్ ‘‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’’ కింద ఈ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నారు.
Telangana CM: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయం సమరభేరి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధ పడకండి.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు.
CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.
Kharge Slams BJP: పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించింది.. కానీ, బీహార్ ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. నరేంద్ర మోడీకి దేశ భద్రతపై లేదని విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా అందరూ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. తెలంగాణలో కులగణన.. దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు.
రేవంత్ రెడ్డి డిమాలిషన్ మాన్, ఇపుడు డైవర్షన్ మాన్ అని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లీజుపై రేవంత్ ఎన్నో మాట్లాడారు.. ఇపుడు ఏమీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ హై కమాండ్స్ ఎప్పుడో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలకి కాకుండా బీజేపీకి ఓటు వేయాలని బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సభ పేరును ‘‘సామాజిక అన్యాయ సమర భేరీ’’గా మార్చుకోండి అని సూచించారు. ఏం ఉద్దరించారని సభ పెడుతున్నారు? అని అడిగారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీకైనా ప్రధాని పదవిచ్చారా?.. అర్ధశతాబ్ద కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని సీఎం చేశారా?.
మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర వేయాలి.. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకు రావాలని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది.. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
MLA Payal Shankar: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని అన్నారు.